పాకిస్తాన్‌ ప్రధాని తానో దద్దమ్మనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కోర్టులో ఇలాంటి కామెంట్స్ చేశారు. తానో తెలివి తక్కువ వాడినన్న పాక్‌ ప్రధాని పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదని అంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు తన సెక్రటరీ ఇచ్చిన ఓ నోట్‌ను తిరస్కరించిన కారణంగా రెండు బిలియన్ల రూపాయలు నష్టపోయానని కోర్టుకు చెప్పారు.

అంతే కాదు..  తన కొడుకు ఓ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే.. టాక్సులు వేసి 800 మిలియన్ల రూపాయలు వసూలు చేశానని చెప్పుకొచ్చారు. ఇదందా ఎందుకు చెప్పారంటే.. తానెంతో నిక్కచ్చి మనిషినో అని వివరించేందుకు ఈ డైలాగులన్నీ చెప్పారు. ప్రధాని షరీఫ్‌తో పాటు ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుకు విచారణకు హాజరైన పాక్ ప్రధాని ఈ కామెంట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: