అమెరికా మరోసారి చైనాను హెచ్చరించింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తైవాన్ పరిణామాలు రెండు దేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరమానికి దారి తీస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌ పర్యటనలో బైడెన్‌ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌ విషయంలో చైనా బలవంతంగా జోక్యం చేసుకొంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమెరికా సైనికపరంగా స్పందిస్తుందని చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే.. దీనిపై చైనా కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని చైనా ఘాటుగా స్పందించింది.  తైవాన్‌ విషయంలో చైనా జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తేల్చి చెప్పారు. దీంతో పాటు చైనాలోని నిరంకుశ పాలన అమెరికా కంటే బెటర్‌ అని జిన్‌ పింగ్‌ అన్నారని బైడన్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయన..  నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారని బైడన్ తాజాగా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: