వైఎస్ జగన్ పాలనపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి కంటే మార్వాడి మేలు అంటూ విమర్శించారు. మార్వాడీలు రోజు వారీ వడ్డీ అయినా ఇంత భారం ఉండదని సీపీఐ నేత రామకృష్ణ  అన్నారు. రాష్ట్రంలోని అధిక ధరలు, బస్సు, విద్యుత్ చార్జీలు, పన్నుల బాదుడును సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. జగన్ మూడేళ్ళ పాలనతో రాష్ట్రంలో ప్రజలెవరు సంతోషంగా లేరన్న సీపీఐ నేత రామకృష్ణ.. జగన్ పాలనలో ఒక్క రంగంలో అయినా అభివృద్ధి జరిగిందా అని నిలదీశారు.


దావోస్ లో పెట్టుబడిదారులు కేటీఆర్ ని కలిశారు కానీ.. జగన్ దగ్గరికి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి అంటున్న సీపీఐ నేత రామకృష్ణ.. చెప్పుకోవడానికి ఏమి లేక బస్ యాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బస్ యాత్ర చేసిన మంత్రులంతా డమ్మీలేనని.. ఆ మంత్రులు గుండె మీద చెయ్ వేసుకుని అధికారం ఉందొ లేదో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: