ప్రధాని మోదీ ఇండియా రేంజ్‌ పెంచేశారని చెబుతున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గతంలో స్మాల్‌ పాక్స్, చికెన్‌ పాక్స్‌ వంటి రోగాలకు ఔషధాల ఆవిష్కరణకు 20 ఏళ్లు పట్టిందని.. పోలియోకు ఔషధం కనిపెట్టేందుకు 30 ఏళ్లు పట్టిందని.. కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో
కొవిడ్‌ టీకా మాత్రం ఏడాదిలో తీసుకురాగలిగామని జేపీ నడ్డా చెప్పుకుంటున్నారు. అలాగే 200 కోట్ల టీకాలు వేగంగా పంపిణీ చేసిన దేశంగా ఇండియా రికార్డు సృష్టించిందని జేపీ నడ్డా అంటున్నారు.


ఇప్పుడు భారత్‌ అంటే.. ప్రపంచం నుంచి తీసుకునేది కాదు, ప్రపంచానికి ఇచ్చేది అంటున్నారు జేపీ నడ్డా. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో చర్చించి భారతీయ పౌరులను క్షేమంగా తీసుకువచ్చామన్న జేపీ నడ్డా.. నెల రోజుల్లో 23వేల మందిని ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చామని గుర్తు చేశారు.
ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా బయటపడేందుకు ఇతర దేశస్థులు భారత జెండాలు పట్టుకున్నారని నడ్డా అంటున్నారు. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న గౌరవానికి ఇదే నిదర్శనం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: