ఈ ఏడాది ముందుగానే వర్షాలు పలకరించనున్నాయి. మునుపటి అంచనాల కంటే ముందుగానే భారత భూభాగాన్ని ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు తాకాయి. ఇప్పుడు అదే వేగంగా ఇతర ప్రాంతాలకూ  విస్తరిస్తున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాల ఉత్తర ప్రాంతం కర్ణాటకలోని కార్వార్ , బెంగుళూరు, ధర్మపురి ప్రాంతాలపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి త్వరలోనే రాయల సీమ జిల్లాలకు ఆ తదుపరి కోస్తాంధ్ర ప్రాంతానికీ విస్తరించే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ నుంచి దిగువన తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పుదుచ్చేరి తదతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఉరుములతో కూడిన జల్లులు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: