పాకిస్థాన్‌లోని కరాచీలో హిందూ దేవాలయంపై ఇటీవల దాడి జరిగింది. బుధవారం రాత్రి కరాచీలోని కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హిందూ దేవాలయంపై ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. మోటారు సైకిళ్లపై వచ్చిన కొందరు దుండగులు ఆలయంలోని విగ్రహాలపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లో  మైనార్టీలపై మతపరంగా జరుగుతున్నవ్యవస్థీకృత హింసకు ఈ దాడి నిదర్శనం అంటూ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది.


హిందూ ఆలయంపై దాడి అంశంపై పాకిస్థాన్‌ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ తన  నిరసనను తెలియజేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరవిందమ్ బాగ్చి ప్రకటించారు. పాక్‌లోని మైనార్టీల రక్షణ, భద్రత, యోగక్షేమాల కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు చెప్పింది. అయితే పాకిస్తాన్‌ వర్గాలు మాత్రం సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపాయి. ఇలాంటి ఘటనలతో పాకిస్తాన్‌లోని హిందువుల్లో భయాలు నెలకొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: