భారత్, చైనా, నేపాల్‌ సరిహద్దు ప్రాంతం అంటే హిమాలయ పర్వతాలే.. ఆ హిమాలయాల్లోని ఇరవై అయిదు హిమానీ నద సరస్సుల పరిమాణం పెరుగుతోందట. ఈ జలాశయాల విస్తీర్ణం గత 13 ఏళ్లలో 40 శాతం మేర పెరిగందట. ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని శాస్త్ర, పర్యావరణ కేంద్రం సీఎస్‌ఈ హెచ్చరిస్తోంది. దీని వల్ల అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ రాష్ట్రాలకు పెను ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు.

ఈ సరస్సులు పెరగడం వల్ల.. ఆకస్మిక వరదుల వంటి ముప్పు ఆయా రాష్ట్రాలకు పొంచి ఉంటుంది. మరి అసలు ఈ సరస్సుల పరిమాణం ఎందుకు పెరుగుతోంది.. దీనికి కారణాలేంటి అని ఆలోచిస్తే.. హిమానీనదాలు కరగడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమనీ నదాలు కరుగుతున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో పెనుముప్పుగా మారుతున్నాయి. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: