ఆంధ్రాలో ఆర్టీసీకి సోమవారం పండుగ రోజుగా మారింది. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయంపై పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేసవి సెలవుల ప్రభావం బాగా పడింది. సోమ వారం ఒక్కరోజే 18.33 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది. ప్రయాణికుల రద్దీ కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఏపీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడిపింది. తిరుమల- తిరుపతి మధ్య అత్యధికంగా బస్సు సర్వీసులు తిప్పింది. తిరుమలకు రోజూ 2400  ట్రిప్పుల వరకు నడుపుతుండగా సోమవారం 2852 ట్రిప్పులు నడిపింది. తిరుపతి జిల్లాలో నిన్న  84 శాతం ఓఆర్ నమోదు చేసింది.  1.75 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. తెలంగాణ బస్సుల్లో చార్జీలు పెంచడం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని ఈడీ బ్రహ్మానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఏపీ బస్సుల్లో  బస్సుల్లో  రద్దీ బాగా పెరిగిందని బ్రహ్మానంద రెడ్డి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: