రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2 నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనా రష్యాకు మద్దతుగానే ఉంది. అయితే.. తాజాగా చైనా ఓ షాకింగ్‌ ఆఫర్ ఇచ్చింది. ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారంలో నిర్మాణాత్మకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది.  
పుతిన్‌తో ఫోన్‌ సంభాషణలో చెప్పినట్లు చైనా వార్తా సంస్థ వెల్లడించింది. సంబంధిత పక్షాలన్నీ బాధ్యతాయుత పాత్రను పోషించాలని ఈ సందర్భంగా చైనా అభిప్రాయపడింది. సంక్షోభానికి సరైన పరిష్కారం లభించేలా తమవంతు పాత్రను పోషిస్తామన్న చైనా అధినేత జిన్‌పింగ్‌ పుతిన్‌తో అన్నట్టు తెలుస్తోంది. వాస్తవాలు, చారిత్రక సత్యాలు పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర వైఖరి అనుసరిస్తామన్న చైనా.. ప్రపంచశాంతి పరిరక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక పురోగతి నిలకడగా ఉంచేందుకు పాటుపడుతున్నామంటున్న అవసరమైతే ఉక్రెయిన్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: