రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులు మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు. బోట్లకు మరమ్మతులు చేసుకుని కొత్త రంగులతో హంగులు దిద్దుతూ కడలిలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం విధించిన రెండునెలల వేట నిషేధం ఈ నెల 14 తోనే ముగిసింది. అయితే.. ఈ నెల 17 వ తేదీన మంచి రోజుగా భావించి మత్స్యకారులు వేటకు బయలుదేరుతున్నారు. చేపల వేటపై ఆధారపడి రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. చేపలు పిండోత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధిస్తుంది.


 ఈ రెండు నెలల విరామ సమయంలో మత్స్యకారులు బోట్లకు అవసరమైన మరమ్మతులు చేయించి వేటకు సిద్ధమవుతారు. వేట ప్రారంభానికి ముందే వలలను అల్లుకుని పెట్టుకుంటారు. ఏపీ నుంచి ముంబై, చెన్నై, ఢిల్లీ, కేరళ ,కోల్కతా రాష్ట్రాలకు చేపలు ఎగుమతి అవుతుంటాయి. వేట విరామ సమయంలో మత్స్యసంపద లో పిండోత్పత్తి జరిగి తొలిరోజుల్లో అధికంగా చేపల సరుకు పడుతుంది. ఇందుకోసం తొలి వేటలో బోట్లు పంపేందుకు యజమానులు ఆసక్తి చూపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: