జేడీ లక్ష్మీ నారాయణ.. ఐపీఎస్‌.. ఈ పేరు కొన్నాళ్ల క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. జగన్ కేసుల విచారణతో ఆయన ఒక్కసారిగా అప్పట్లో ఫేమస్ అయ్యారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్‌ అయిన ఆయన ఆ తర్వాత ముంబై వెళ్లిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా ముందస్తుగానే రిటైర్‌ అయ్యి.. రాజకీయాల్లోకి వచ్చారు.. జనసేనలో చేరినా.. ఆ తర్వాత యాక్టివ్‌ గా లేరు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా?


రాజమండ్రి వద్ద 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అవును.. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. తాను కూడా రాజమండ్రి వద్ద 12 ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని సేంద్రీయ సేద్యం చేస్తున్నానని.. మొదటి పంట తీసుకోబోతున్నానని హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. సేంద్రీయ సేద్యంలో రెండు మూడేళ్ళపాటు తగ్గే దిగుబడులపై ప్రభుత్వం భరోసా ఇస్తే బాగుంటుందన్న లక్ష్మినారాయణ.. సర్టిఫికేషన్ ఏజెన్సీ వ్యవస్థ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

jd