దేశాన్ని మరోసారి కరోనా కమ్మేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు రోజూ 12వేలకుపైగానే నమోదవుతున్నాయి. అంతే కాదు.. దేశంలోని యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ లక్షకు చేరువ అవుతోంది. దేశంలో సగటున రోజూ నాలుగున్నర లక్షణ  నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో కనీసం 12, 13 వేల కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిస్తున్న గణాంకాలు భయపెడుతున్నాయి.


ఒక్క మహారాష్ట్రలోనే రోజూ 3 నుంచి 4 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజూ 15 నుంచి 20 మంది వరకూ కరోనా మహమ్మారికి బలవుతున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 200కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: