అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర, మానస్‌, సుబంసిరి నదులు అస్సాంలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అస్సాం పొరుగునే ఉన్న మేఘాలయలో కూడా ఐదు లక్షల మంది ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడటం కారణంగా రెండు ప్రధాన జాతీయ రహదారులపై పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.


అస్సాంలోని 32 జిల్లాల్లోని 31 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. ఇప్పటి వరకూ 50 మందికి పైగా  ప్రాణాలు కోల్పోయారు. నాలుగు వేల గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. అస్సాంలో  500కుపైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిలో లక్షన్నర మంది తలదాచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక సామాగ్రి అందిస్తున్నారు. అస్సాం అంతటా 300కు పైగా సహాయ సామాగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యల్లో అస్సాం విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: