ప్రపంచం కోసం భారత్ ఓ మంచి పని చేసింది.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి కరోనాకు తొలి రోజుల్లోనే టీకాను ఇండియా కనిపెట్టింది. అంతే కాదు.. ఆ కొవిడ్ వ్యాక్సిన్ తయారీపై పేటెంట్ హక్కుల ఎత్తివేతకు ఇండియా కృషి చేసింది. అందుకు సభ్యదేశాలన్నింటినీ భారత్ ఒప్పంచగలిగింది. ఈ అంశంపై భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాల మంత్రుల సమావేశంలో భారత్ కు ఈ విషయంలో ప్రశంసలు దక్కాయని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు.


అలాగే రైతులు, మత్స్యకారుల ఉపాధి రక్షణకు భారత్  చేసిన కృషి ఫలించింది. సముద్ర లోతుల్లో చేపలు పట్టడాన్ని నియంత్రించాలన్న భారత విజ్ఞప్తిని W.T.O పరిగణనలోకి  తీసుకుంది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నాలుగు రోజులపాటు జరిగిన  W.T.O సభ్యదేశాల మంత్రుల భేటీలో ఇండియాకు గోయల్  నాయకత్వం వహించారు. ఆహార భద్రతకు సంబంధించిన చర్చల్లోనూ పురోగతి కనిపించింది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి అందేవాటిపై ఎలాంటి నిషేధం ఉండొద్దన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వ అభ్యంతరాల మేరకు సవరించింది. శభాష్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: