ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ.. రాజకీయాల్లో వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. చాలాసార్లు గెలిచిన అభ్యర్థి కన్నా.. గెలిచిన పార్టీ చాలా ముఖ్యంగా మారుతోంది. ఇప్పుడు ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలోనూ అంతే.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలుస్తారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. విక్రంరెడ్డి విజయం కోసం వైసీపీ నేతలు అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు.


విక్రం రెడ్డినే గెలిపించాలని మంత్రులు అంబ‌టి రాంబాబు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధన్‌ రెడ్డి ఆ నియోజక వర్గం ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు.. విక్రం రెడ్డి బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు సరికావని ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని.. చివరకు  నెల్లూరులో క్రాప్‌ హాలిడే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇక జనసేనకు  రాజకీయ స్పష్టత లేదని అంబటి దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: