ఏపీ హైకోర్టు మరోసారి ఏపీ సీఎం జగన్‌కు షాక్ ఇచ్చింది. నిన్నటి నుంచి నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అయ్యన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టారంటూ ఆయన ఇంటి గోడను రెవెన్యూ అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అయితే.. మాజీ మంత్రి అయ్యన్నకు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని ఏపీ  హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


తన ఇల్లు కూల్చివేతపై అయ్యన్న పాత్రుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరుపున న్యాయవాది సతీష్ వాదనలు వినిపించారు. మరోవైపు మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు పై కక్ష సాధింపు వ్యతిరేకిస్తూ టీడీపీ చలో నర్సీపట్నం నిరసన పిలుపు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు పాల్గొంటారు. చలో నర్సీపట్నం కార్యక్రమంలో సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: