ఇక అగ్నిపథ్ పథకం విరమించుకోవాలని ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే..అగ్నివీర్ నియామకాలకు ఆర్మీ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కూడా భారీ నిరసనల మధ్య వివరణాత్మక నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 24 వ తేదీన ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రానుంది. నేవీకి సంబంధించి రేపు నోటిఫికేషన్ కూడా రానుంది.ఇక అగ్నిపథ్ అనేది జూన్ 14, 2022న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిక్రూట్‌మెంట్ పథకం. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ కూడా "అగ్నివీర్స్" అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీ అన్ని కేడర్‌లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు.


ఇక అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ నోటీసు తేదీల విషయానికి వస్తే.


1.ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల జూన్ 20, 2022 
2.ఇండియన్ నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల తేదీ
జూన్ 21, 2022

3.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ 24,

మరింత సమాచారం తెలుసుకోండి: