ఒక్కోసారి వైద్యం వికటిస్తుంది.. కానీ.. ఆ వికటించడం కొందరి కేరీర్‌కే ముప్పు తెస్తుంది.. కర్ణాటక యువనటి స్వాతి విషయంలో ఇలాగే జరిగింది. దంతవైద్యం వికటించి కర్ణాటక నటి ముఖం వికృతంగా మారింది. యువనటి స్వాతి పంటి నొప్పి అనిబెంగుళూరులోని ఓ దంత వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యుల సలహా మేరకు రూట్  కెనాల్ ట్రీట్‌మెంట్‌  చేయించుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న చూసుకుంటే ఆమె ముఖం ఉబ్బిపోయింది. విపరీతమైన వాపుతో గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.


అదేంటని డాక్టర్‌కు ఫోన్ చేస్తే.. వాపు రెండుమూడు రోజుల్లో తగ్గుతుందని చెప్పారు. కానీ.. మూడు వారాలైనా తగ్గలేదు. వాపుతోపాటు ముఖమంతా నొప్పిగా ఉంది. దీంతో ఆమె మరో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తేలింది అసలు విషయం. పాత వైద్యుడు అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చాడట. ఇప్పుడు ఆ వాపు తగ్గేందుకు స్వాతి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. కోలుకున్నాక పాత వైద్యుడిపై చర్య తీసుకుంటానంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: