ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన బిలియనీర్లు ఎందుకనో ఇటీవల విడాకుల బాట పడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. వీరి విడాకులు కూడా కోట్లకు కోట్ల పరిహారం కారణంగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా గూగుల్  సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ కూడా విడాకులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు.


ఇటీవలి కాలంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న మూడో మెగా బిలియనియర్  సెర్గీ బ్రిన్. 48 ఏళ్ల సెర్గీ బ్రిన్ ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా.. బ్లూమ్ బర్గ్ బిలియనియర్స్ జాబితా ప్రకారం ఆయన ఆస్తి 94 బిలియన్ డాలర్లు. అయితే సెర్గీ బ్రిన్ తాజా విడాకులకు మందు కూడా ఓసారి విడాకులు తీసుకోవడం విశేషం.

గతంలో మైక్రోసాఫ్ట్  వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాకుడు జెఫ్  బెజోస్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు సెర్గీబ్రిన్ వంతు వచ్చింది. భార్యతో తీవ్ర విభేదాలే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: