ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  కీలక నిర్ణయం తీసుకున్నారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్ణయించాలని బీజేపీ పార్టీ శ్రేణులను ఆదేశించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా యోగా దినోత్సవాన్ని నిర్వహించలేదు.


అందుకే ఇవాళ్టి యోగా దినోత్సవం కార్యక్రమాన్ని బీజేపీ ఘనంగా చేపడుతోంది. దేశంలోని 75వేల ప్రాంతాల్లో బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా కర్ణాటకలోని మైసూరులో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.  మైసూరు ప్యాలెస్ లో మోదీ యోగా చేయనున్నారు. అదే  ప్యాలెస్  ప్రాంగణంలో ఆయనతో పాటు 15వేల మంది యోగాసనాలు వేస్తారు. ఇక హోం మంత్రి అమిత్ షా దిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ  అధ్యక్షుడు జె.పి.నడ్డా నోయిడాలో యోగాసనాలు వేస్తారు.


ఇక ఈ ఏడాది యోగా డే ఉత్సవాలను యోగా ఫర్ హ్యుమానిటీ  నినాదంతో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ యోగా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: