కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారించిన ఈడీ ఇప్పుడు సోనియా గాంధీని విచారించేందుకు రెడీ అవుతోంది. వాస్తవానికి సోనియా గాంధీని ముందే విచారించాల్సి ఉన్నా.. ఆమె అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిన్ననే దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే..  ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


సోనియా గాంధీకి ఈనెల 2న కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత 10రోజులకు ఆమె వైరస్‌ అనంతర సమస్యలతో గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ముక్కు నుంచి రక్త స్రావం కావటంతో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ గతంలో చెప్పారు. ఊపిరితిత్తుల దిగువ భాగంలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈడీ మాత్రం విచారణకు రంగం సిద్ధం చేసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: