అమెరికా మరో దేశ నౌకలకు షాక్ ఇచ్చింది. పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇరాన్ దేశ నౌకాదళ బోట్లకు హెచ్చరికలు పంపింది. పర్షయన్ గల్ఫ్‌ ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన మూడు ఇరాన్‌ నౌకాదళ  స్పీడు బోట్లను అమెరికా యుద్ధ నౌక హెచ్చరికలు పంపి అడ్డుకుంది. ముందు హెచ్చరిక మంటను గాలిలోకి కాల్చి ఆ నౌకలు వెనక్కి వెళ్లేలా చేసింది.


స్ట్రైట్‌ ఆఫ్‌ హార్మూజ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. ఈ హెచ్చరిక మంటల దృశ్యాలను దృశ్యాలను బెహ్రెయిన్‌ నౌకా దళం విడుదల చేసింది. అమెరికా యుద్ధ నౌక.. ఇరాన్‌ బోట్లు ఎదుట పడగానే ముందుగా పెద్దగా శబ్దాలు చేస్తూ వాటిని హెచ్చరించిందని బెహ్రెయిన్‌ నావీ చెబుతోంది. అప్పటికీ ఇరాన్ నౌకలు వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా యుద్ధనౌక హెచ్చరిక మంటను గాలిలోకి పేల్చేసిందని బెహ్రెయిన్ నౌకాదళం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: