ప్రధాని నరేంద్ర మోడీ మరో  సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ఆదివాసీ మహిళను భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఒడిశా టీచరమ్మ, ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ పోటీ చేయనున్నారు. ఆమెకు ఒడిశా రాష్ట్ర మంత్రిగా, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో దేశంలోనే తొలిసారి ఎస్టీలకు అవకాశం ఇస్తున్నట్టయింది.


నిన్న రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ పదవి కోసం బీజేపీ మొత్తం 20 పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. చివరకు దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ద్రౌపదీ ముర్మూ ఎంపిక ద్వారా ఆ గౌరవం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: