రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి దేశంలో రాష్ట్రపతి పదవిని ఎస్టీలకు ఇచ్చామని చెప్పుకుంటోంది. అయితే.. ఈ ఎంపికకు దారి తీసిన పరిస్థితులేంటి... ఈ ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక రాజకీయం ఏంటి.. అని పరిశీలిస్తే.. ఈ ఎంపిక పూర్తిగా రాజకీయ కోణంలోనే జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది చివరిలో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది  రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్నవే ఎక్కువ. ఎలాగూ ఎస్టీలకు ఇప్పటి వరకూ ఈ పదవి దక్కలేదు. ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే.. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఘనంగా చెప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎస్టీలకు  బలమైన సంకేతం ఇవ్వడానికి ద్రౌపదికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: