ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఈ ఏడాది అమ్మ ఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో పడబోతున్నాయి. ఈ నెల 27 తేదీన అమ్మఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ నెల 23న అంటే ఇవాళ చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈనెల 27న ప్రభుత్వం  లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయబోతోంది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి 6301 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందించింది. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. విద్యాసంస్థలు ప్రారంభించే సమయంలో సరిగ్గా అమ్మ ఒడి డబ్బులు రావడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు కాస్త ఊరటగా ఉంటుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: