ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ఒంటరిగా మారుతుందని.. ఆ దేశాన్ని నాటో దేశాలు అన్ని విధాలుగా ఇబ్బందిపెడతాయని అంతా ఊహించారు. అంతే కాదు.. ఆంక్షలతో.. డిజిటల్ బహిష్కరణ వంటి విధానాలతో రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అవుతుందని అంతా భావించారు.

కానీ ఇప్పుడు సీన్ చూస్తే రివర్స్‌లో సాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా డాలర్ విలువ క్రమంగా పతనం అవుతుంటే రూబుల్ విలువ మాత్రం భారీగా పెరుగుతోంది. తనతో వ్యాపారం చేసే దేశాలు డాలర్లలో కాకుండా రూబుళ్లలోనే చెల్లించాలని రష్యా కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ప్రపంచంలో రూబుల్‌ కు డిమాండ్ పెరిగింది. ఎన్నో ఆంక్షలు ఉన్నా రష్యా నుంచి ఆయిల్ అనేక దేశాలు కొంటూనే ఉన్నాయి. దీంతో యుద్ధానికి ముందు 122 రూబుల్లుగా ఉన్న డాలర్ విలువ ఇప్పుడు 56 రూబుళ్లకు పడిపోయింది. అంతగా రూబుల్ బలపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: