అమ్మఒడి పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది అమ్మఒడి అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పాఠశాల హాజరు ఆధారంగా పిల్లలకు లబ్ది చేకూరుతుందని మంత్రి బొత్స చెబుతున్నారు. పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపితేనే పథకం వర్తిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.


అలాగే ప్రభుత్వం ఇచ్చే రూ. 15 వేలలోల రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వహణకు ఖర్చు చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఇదే సమయలో ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స అంటున్నారు. ఉపాధ్యాయ కొరతపై సంఘాలతో చర్చ జరుపుతామన్నారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: