ఏపీ సీఎం జగన్ అధకారంలోకి వచ్చిందే సంక్షేమ ఫథకాల పేరు చెప్పి.. అలాంటి జగన్ ఇప్పుడు ఒక్కో పథకంలోనూ కోతలు విధిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్.. ఒంటరి మహిళల పింఛనులో వయో పరిమితి పెంచి కోత విధించారని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆరోపించారు. గతంలో దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఇస్తానని జగన్ ఓట్లు పొందారన్న వంగలపూడి అనిత.. ఇప్పుడు మాట మార్చి ముస్లిం మహిళలను మోసం చేశారని టీడీపీ నేత వంగలపూడి అనిత  మండిపడుతున్నారు.


అమ్మఒడి విషయంలోనూ ఇలాగే చేశారని టీడీపీ నేత వంగలపూడి అనిత ఆరోపించారు. అమ్మ ఒడి పథకానికి  కోతలు పెట్టి లక్షల్లో లబ్ధిదారులను తొలగించారని అనిత విమర్శించారు. ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ ఫీజు లేకుండా చేయాలని టీడీపీ నేత వంగలపూడి అనిత  డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: