ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు ఆగడం లేదు.. రోజురోజుకూ రష్యా కొత్త నగరాలకు యుద్ధాన్ని విస్తరిస్తోంది కూడా.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ లో పెళ్లి బాజాలు మోగడం విశేషం. ఉక్రెయిన్‌లో అనేక జంటలు ఇప్పుడు పెళ్లిబంధంతో ఒక్కటవుతున్నాయట. ఒక్క రాజధాని
కీవ్‌లోనే 4 వేల వివాహాలు జరుగుతున్నాయట. యుద్ధంతో జీవితాలు అల్లకల్లోలంగా మారుతున్నా.. ఇలాంటి పరిస్థితి ఏంటంటారా.. చావైనా, బతుకైనా కలిసే ఉందామని కొన్ని జంటలు నిర్ణయించుకుంటున్నాయట. కొందరైతే.. యుద్ధానికి వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటున్నారు.



ఇంకొందరు ముందు ముందు ఇంకెంలా ఉంటుందోనని భయపడి ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నారట. బతికిన కొద్దిరోజులైనా కలిసి బతకొచ్చనే ఈ జంటలు  పెళ్లి చేసుకుంటున్నారట. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా అమలులో ఉంది. దీని ప్రకారం సైనికులు, సాధారణ పౌరులు దరఖాస్తు చేసుకొన్న రోజే వివాహం చేసుకోవచ్చు. ఈ ఏప్రిల్‌లో రష్యా సేనలు కీవ్‌ పరిసరాల నుంచి వెళ్లిపోయాక పెళ్లిళ్లు పెరిగాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: