శివసేన అంతర్గత రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యూహాలు...మరోవైపు తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే ప్రతివ్యూహాలతో రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు నేతలు గువాహటిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఏక్ నాథ్ శిందే వర్గంలోని 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేతో టచ్ లో ఉన్నారట.


శిందే వర్గంలోని 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో దోస్తీని వ్యతిరేకిస్తున్నారట. అంతే కాదు.. ఉద్దవ్ ఠాక్రే ఇప్పుడు అసమ్మతి ఎమ్మెల్యేల భార్యలతో రాజకీయం చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే... వారి భర్తల్ని బుజ్జగించాలని కోరు తున్నారట. అంతే కాదు.. శివసేన కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం  వై ప్లస్ భద్రత కూడా కల్పించిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: