మొన్న ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ దాదాపు 83 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే.. ఇక్కడ వైసీపీ గెలవలేదు.. నైతికంగా ఓడిందంటున్నారు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.

అందుకు ఆయన ఓ లాజిక్ చెబుతున్నారు. ఏక పక్షంగా జరిగిన ఎన్నికల్లోనూ అధికార పార్టీకి మంచి మెజార్టీ రాలేదట. పోలింగ్ శాతం తగ్గడం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా చూడాలట. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రజల అసంతృప్తికి ప్రతిబింబంగా ప్రభుత్వం చూడాలట.  82వేలు మెజార్టీ వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం మురిసిపోవడం కాదు.. ఈ ఎన్నిక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొన్నైనా పాఠాలు నేర్చుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అంటున్నారు. సానుభూతితో ప్రధాన ప్రతిపక్ష్యం పోటీలో లేకపోయినా ఓటింగ్ శాతం తగ్గిందని.. ఇది ప్రజల అసంతృప్తికి నిదర్శనమని ఆయన అంటున్నారు. మరి ఇదేం లాజిక్కో?

మరింత సమాచారం తెలుసుకోండి: