ఖరీఫ్ సీజన్ లో ప్రతి పైరును ఈ క్రాపింగ్ ద్వారా తప్పక నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలని.. నమోదు చేశాక డిజిటల్ రసీదు ఇవ్వాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేయాలని మిల్లర్ల పాత్రను తీసేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రైతులు పండించిన పంటలకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలని ఆ బాధ్యత అధికారులదేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఖరీఫ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లు అంశాలపై  ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ లో రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది. ఇ–క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: