ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలని సీఎం జగన్ నిర్దేశించారు. ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత,ఆ  తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత  పౌరసరఫరాల శాఖదేనని సీఎం జగన్ అన్నారు. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని వేరే వే –బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.  దీనివల్ల రైతుకు ఎంఎస్‌పీ  లభిస్తుందన్నారు.


రావాల్సిన గిట్టుబాటు ధరలో  ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలని సీఎం జగన్ అన్నారు.  పాలకులుగా, అధికారులుగా మనం గొంతు లేని వారిపక్షాన నిలవాలన్న సీఎం..   పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి అన్నారు. కొనుగోలు చేయడమే కాకుండా,ఎంఎస్‌పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనదేనని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: