రాష్ట్రంలో రైతుల పంటలను ఆగస్టు నాటికి ఈ క్రాపింగ్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇ–క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు,ఫిజికల్‌ రశీదు  ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలన్నారు. రైతుకు  నష్టం వస్తే ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వస్తుందని సీఎం జగన్ అన్నారు. దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలని సీఎం సీఎం జగన్  సూచించారు.  


వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జాయింట్‌ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలని సీఎం జగన్  సూచించారు. గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలని సీఎం జగన్  సూచించారు. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఇ–క్రాప్‌లో లోడ్‌ చేయాలన్న సీఎం జగన్.. జూన్‌ 15 నుంచి ఇ– క్రాపింగ్‌ మొదలు పెట్టి ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీ చేపట్టాలని.. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: