ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. ఈ ఏడాది నుంచి మరింత ఆధునికంగా తరగతి గదులను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.  తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కార్యాచరణ  రూపొందించాలని ఇప్పటికే  సీఎం ఆదేశించారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం అంటున్నారు. తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు ఉండాలంటున్నారు. డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించనున్నారు. వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయి. వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది. స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, పెద్దదిగా ‌ చేసుకునేలా ఏర్పాటు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: