ఇవాళ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొన్ననే ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి ఫలితాల తేదీని నిన్న ఖరారు చేసింది. ఇవాళ పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది.

పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ ఉదయం 11.30కు ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు  ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలను  bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్లలో ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్‌ 2తో ముగిశాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు సుమారు 5 లక్షల మంది రాశారు. ఇప్పటికే తెలంగాణలో కళాశాలలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా పూర్తవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: