రష్యా అధ్యక్షుడు పుతిన్ పై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిప్పులు చెరిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషపూరిత మగతనానికి కచ్చితమైన ఉదాహరణ అంటూ మండిపడ్డారు. పుతిన్ ఓ మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టేవాడు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటున్నారు. ఉక్రెయిన్ పై సైనికచర్య విషపూరిత మగతనానికి ఉదాహరణగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్ణించారు.


అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మెరుగైన విద్య అందించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు. ఎక్కువమంది మహిళలు అధికారం చేపట్టాలని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఆకాంక్షించారు. మహిళల చేతుల్లోనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని ప్రజలంతా కోరుకుంటున్నా.. ప్రస్తుతానికి అలాంటి ఒప్పందం జరిగే అవకాశం లేదన్నారు. శాంతి చర్చల దిశగా పుతిన్ ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని బ్రిటన్ ప్రధాని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: