మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఓ కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల అనూహ్యంగా సీఎం పదవి దక్కించుకున్న ఏక్‌నాథ్ శిందే బల పరీక్ష  నెగ్గారు. శివసేనలో తిరుగుబాటు తీసుకువచ్చి.. బాల్ ఠాక్రే కొడుకు నుంచి ఏకంగా పార్టీ లాగేసుకున్న ఏక్‌నాథ్ శిందే.. అనూహ్యంగా బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇవాళ బలపరీక్షలో నెగ్గుతారా లేదా అన్న ఉత్కంఠ వీడిపోయింది.

ఆయన సులభంగానే బలపరీక్ష నెగ్గుతారని ముందు నుంచి ఊహించిందే. ఎందుకంటే.. మొన్న జరిగిన స్పీకర్‌ ఎన్నికతోనే శిందే గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నేత రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నిక సజావుగానే సాగింది. ఓటింగ్‌లో బీజేపీ అభ్యర్థి నర్వేకర్‌కు  164 మంది ఎమ్మెల్యేల మద్దతు పలికారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన రాజన్ సాల్వీకి కేవలం 107  ఓట్లు మాత్రమే వచ్చాయి.  స్పీకర్‌ ఓటింగ్‌కు మజ్లిస్‌, సమాజ్‌వాదీ పార్టీ దూరంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఇవాళ జరిగే బలపరీక్షలోనూ ఇదే సీన్ రిపీటైంది. శిందే సర్కారుకు అనుకూలంగా 164 ఓట్లు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: