బ్రిటన్ లో ప్రధాని బోరిస్  జాన్సన్ రాజీనామా చేయక తప్పదా అన్న పరిస్థితి నెలకొంది. ఆయన  ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రధానిపై విశ్వాసం కోల్పోయామని మొన్న ఇద్దరు సీనియర్  మంత్రులు రాజీనామా చేశారు. నిన్న మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఈ వరుసగా మంత్రుల రాజీనామాలు ఆయన్ను పదవి నుంచి దిగిపోయేలా చేస్తున్నాయి.


బ్రిటన్  ప్రధాని బోరిస్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా లాక్ డౌన్  సమయంలో అధికార నివాసంలో మందు పార్టీలు చేసుకోవడం వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్  విప్ గా క్రిస్  పించర్ ను నియామించడం కూడా వివాదం అయ్యింది. ఎందుకంటే.. జాన్సన్  క్రిస్  పించర్ ను అప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ క్లబ్ లో తాగిన మత్తులో పించర్ అమర్యాదగా ప్రవర్తించారు. ఇప్పటికే..ఆర్థిక మంత్రి రిషి సునాక్ , ఆరోగ్య మంత్రి సాజిద్  జావిద్  రాజీనామా చేయగా.. తాజాగా శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్, రవాణా శాఖ సహాయమంత్రి లారాట్రాట్  కూడా రాజీనామా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: