ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్‌ ప్రముఖ సినిమా కథా రచయిత అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇప్పుడు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా రాజ్యసభకు నామినేట్ చేశారు. రాష్ట్రపతి కోటాలో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇది ఆరేళ్లు ఉంటుంది. విజయేంద్ర ప్రసాద్‌.. అనేక పాన్ ఇండియా సినిమాలకు కథను అందించిన సంగతి తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పి.టి.ఉషను కేంద్రం రాజ్యసభకు నామినేట్  చేసింది. కర్ణాటకలోని ధర్మస్థల మఠం పీఠాధిపతి వీరేంద్ర హెగ్డేను కూడా రాజ్యసభకు నామినేట్  చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కథా రచయిత విజయేంద్రప్రసాద్  దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. విజయేంద్రప్రసాద్  సేవలు.. మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: