వైసీపీ భారీ పండుగకు సిద్ధమవుతోంది. జులై 8, 9వ తేదీల్లో భారీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతోంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. అందుకే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించనున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండ్రోజులు పూర్తిగా ప్లీనరీ సమావేశాల వద్దే ఉంటారు. రాబోయే కాలానికి వైసీపీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ప్లీనరీ సమావేశాల కోసం తరలివచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఎదురుచూస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గత ప్లీనరీలో పార్టీ ఎజెండాను వివరించామని.. ఈ ప్లీనరీలో అధికారంలోకి వచ్చాక ఏం చేశాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది చెబుతామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: