రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల విషయంలో రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు లీడ్ బ్యాంకులను కేటాయిస్తూ రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను లీడ్ బ్యాంక్‌ గా రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే .. సత్య సాయి జిల్లాకు కెనరాబ్యాంక్ ను లీడ్ బ్యాంకుగా రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా ప్రకటిస్తూ ఆయా బ్యాంకులకు బాధ్యతలు అప్పగించింది.  అల్లూరి, అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, కాకినాడ, కోనసీమ, నంద్యాల, ఎన్టీఆర్, పలనాడు, తిరుపతి జిల్లాలకు యూనియన్ బ్యాంక్ లీడ్ బ్యాంకుగా రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అన్ని జిల్లాలకు పథకాల అమలు వంటి అంశాల కోసం  రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ వర్కింగ్ కోడ్ ను కేటాయించింది. ఇక మిగిలిన జిల్లాలకు లీడ్ బ్యాంకుల్లో ఎలాంటి మార్పూ లేదని రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI