దలైలామాకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు చైనా, ఇండియా మధ్య వివాదంగా మారింది. దలైలామా ఇటీవల 87వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ బుధవారం ఫోన్ లో శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై చైనా విమర్శలు గుప్పించింది. టిబెట్  సంబంధింత అంశాల ద్వారా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత్  ఆపాలంటోంది. దలైలామా అనుసరిస్తున్న చైనా వ్యతిరేక వైఖరిని భారత్  పూర్తిస్థాయిలో గుర్తించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు.


అలాగే దలైలామాకు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పైనా చైనా విమర్శలు చేసింది. టిబెట్  అంశం చైనా అంతర్గత విషయమని ఇందులో విదేశీ జోక్యం ఉండరాదంటోంది. అయితే చైనా వ్యాఖ్యలను భారత్  దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్ లో గౌరవ అతిథి అని తేల్చి చెప్పింది. దలైలామాకు భారత్ లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. గతేడాది కూడా దలైలామాకు మోదీ శుభాకాంక్షలు చెప్పినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గుర్తు చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: