శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.. అక్కడ ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరింది. జనం దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆ కోపంతోనే శ్రీలంక ప్రజలు అధ్యక్షుడు, ప్రధానిల ఇళ్లపైకి దాడికి దిగారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే పరారయ్యారు కూడా. ప్రధాని రణిల్‌ విక్రమసింఘే రాజీనామా చేస్తానని ప్రకటించారు.


ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని తెలిపింది. ప్రజాస్వామ్య మార్గాలు, రాజ్యాంగ విలువలు, పురోగతి కోసం శ్రీలంక ప్రజలకు భారత్‌ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భారత్‌ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకకు భారత్‌ మొదటి నుంచి అండగానే నిలుస్తోంది. ఇప్పటివరకు ఇండియా శ్రీలంకకు 3.8బిలియన్‌ డాలర్ల సాయమందించింది. శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి తమకు తెలుసని.. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు ఇండియా అండగా నిలుస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: