యూరప్‌ను ఇప్పుడు దావానలం కబళిస్తోంది. నాలుగు దేశాల్లోని అనేక ప్రాంతాల్లో అడవులు మంటల్లో చిక్కుకున్నాయి. పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, క్రొయేషియా, స్పెయిన్‌లో  మంటలు విజృంభిస్తున్నాయి. ఈ అగ్ని కీలల్లో వందలాది ఇళ్లు కాలి బూడిదవుతున్నాయి.  ఈ మంటల కారణంగా యూరప్‌ దక్షిణ ప్రాంత దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. మంటల్లో అనేక ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి.


ఈ మంటలకు  పెనుగాలులు తోడవడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. పోర్చుగల్‌లో కార్చిచ్చు తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్‌ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ అడవుల్లో మంటలు చల్లార్చేందుకు నీటిని చల్లడానికి పది విమానాలను రంగంలోకి దించారు. ఇక్కడి నుంచి 10వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ అగ్నికీలల ఇలాగే కొనసాగితే పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందన్న ఆందోళన ఆయా దేశాల్లో నెలకొంది. ఈ దావానలం చుట్టపక్కల దేశాలకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: