మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతోంది. గంజాయి కల్చర్ వ్యాపిస్తోంది. ఇప్పుడు ఇదే గంజాయి.. ద్రవ రూపంలోనూ దొరుకుతూ దీని వినియోగం యువతలో బాగా వ్యాపిస్తోంది. ఈ ద్రవరూప గంజాయిని విక్రయిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడం ఇటీవల బాగా పెరిగింది. తాజాగా ఇద్దరిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు నగరంలోని స్థంభాల గరువులో మహేష్, శరత్ అనే ఇద్దరు ద్రవ రూప గంజాయి విక్రయిస్తుండగా పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు.


వీరి వద్ద నుంచి 23 లిక్విడ్ గంజాయి డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బాల్లో 216 గ్రాముల గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 గ్రాముల డబ్బా రేటు రూ.2 వేలు వరకూ ఉందట. తాము  నర్సీపట్నం నుంచి ఈ ద్రవరూప గంజాయిని తెచ్చినట్లు నిందితులు తెలిపారు. గంజాయి తరలింపు, విక్రయాలతో పాటు వినియోగంలో యువత భాగస్వాములు కావొద్దని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: