బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బాసర  విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీ,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య  ధర్నా చేశారు. హైదరాబాద్‌ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.


ఈ ధర్నాలో  వైసీపీ ఎంపీ,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురికావడం చాలా బాధాకరమన్న వైసీపీ ఎంపీ,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య.. విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఫుడ్ పాయిజన్ కు కారకులు ఎవరు.. దీంట్లో కుట్ర దాగి ఉంది అని అన్నారు. బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని.. గురుకుల పాఠశాల, కళాశాలల మెస్ చార్జీలను పెంచాలని.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మొటిక్, ప్యాకెట్ మని చార్జీలు పెంచాలని ఆర్‌ కృష్ణయ్య డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr