రాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులుగా ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్‌డీఏ తరపున ముర్ము పోటీలో ఉన్నారు. ప్రతిపక్షాల తరపున యశ్వంత్‌ సిన్హా  పోటీలో ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికలు చాలా వెరైటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఉంటుంది. ఈ విలువను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా లెక్కేస్తారు.


ఒక్కో రాష్ట్ర  జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది. యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208. అదే ఝార్ఖండ్‌-తమిళనాడు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ  176గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159. తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132 మాత్రమే. మహారాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 175. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ  7 , మిజోరాం ఎమ్మెల్యే ఓటు విలువ 8, నాగాలాండ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 9. అలాగే సగటు ఎంపీ ఓటు విలువ 700. దేశంలో మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ 10లక్షల 86 వేల 431. ఈ ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతి అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: