దేశంలో పది రాష్ట్రాలు అప్పుల పరిస్థితిపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఈ పది రాష్ట్రాలు రుణాల ఊబిలో ఉన్నాయని ఈ సమీక్షకు హాజరైన అధికారులు వివరించారు. శ్రీలంక తరహా ఈ రాష్ట్రాలు దివాలా దిశగా వెళ్తున్నాయని కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఈ పది రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి.

ఈ సమావేశంలో తెలంగాణ అప్పుల ప్రస్తావన రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు అడ్డు తగిలారు. తమ రాష్ట్రం నిబంధనల ప్రకారమే అప్పులు తీసుకుంటుందని టీఆర్ఎస్‌ ఎంపీలు వాదించారు. శ్రీలంక పరిస్థితి వివరిస్తూ మన దేశంలో రాష్ట్రాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని
టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. రాష్ట్రాల సంగతి సరే.. ముందు దేశం అప్పుల సంగతి చెప్పండి అని అన్న టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రశ్నించారు. కేంద్రం ఎంత అప్పు చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రాల అప్పులపై మాత్రమే కాదు.. కేంద్రం అప్పులపైనా చర్చించాలని డిమాండ్ చేశారు. అంటే మొత్తం మీద తెలంగాణ కేసీఆర్‌, కేంద్రంలో మోదీ.. అప్పుల విషయంలో ఇద్దరూ ఇద్దరే అన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr