హిందూపురం.. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం.. గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ గెలిచిన అతి కొద్ది ఎమ్మెల్యే సీట్లలో హిందూపురం ఒకటి. ఇక ఈ  ప్రాంతంలో వైసీపీ నేతల కుమ్ములాట వచ్చే ఎన్నికల్లో సైతం బాలయ్యకు దిగుల్లేకుండా చేస్తున్నాయి. హిందూపురం వైసీపీలో రెండు వర్గాల కుమ్ములాటలు తారస్తాయికి చేరాయి. హిందూపురం వైసీపీలోని అసంతృప్త నేతలతో సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డితో  సమావేశం అయ్యారు.

హిందూపురం వైసీపీలోని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, ఆయన వ్యతిరేక వర్గ నేతలు మంత్రి పెద్దిరెడ్డితో సమావేశమయ్యారు. అయితే.. వారు పెద్దిరెడ్డి సమక్షంలోనే పరస్పరం వాగ్వాదానికి  దిగడం విశేషం. ఇక్బాల్ పై నవీన్ మిశ్చల్, అబ్దుల్ గనీ వర్గం ఫిర్యాదులు చేసింది. ఇక్బాల్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసింది. స్థానికేతరుడైన ఇక్బాల్ కు హిందూపురం  టికెట్ ఇవ్వొద్దని కోరుతోంది. ఇక్బాల్ తమపై పెత్తనం చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని తెలిపారు. మొత్తానికి ఈ గొడవలు బాలయ్యకు మేలు చేస్తున్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: